దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిందంబరం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ధరల పెరుగుదల విషయంలో కేంద్రం శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలంటూ చురకలంటించారు. ఇతర శతాబ్ది ఉత్సవాల మాదిరిగానే.. ప్రధాని నేతృత్వంలోని మంత్రులు ఇటీవల 100 కోట్ల డోసుల టీకా పంపిణీపై సంబురాలు చేసుకున్నారని చిదంబరం గుర్తు చేశారు.
ఇప్పటికే దేశంలో లీటర్ పెట్రోల్, డీజిల్ రూ.100 దాటాయని పేర్కొన్నారు. గ్యాస్ ధరలు రూ.1000 దాటితే మరోసారి సంబురాలు చేసుకునే అవకాశం ఉందని ఎద్దేవా చేస్తూ చిదంబరం ట్వీట్ చేశారు. ఆదివారం వరకు వరుసగా ఐదు రోజుల పాటు దేశంలో ఇంధన ధరలు పెరుగుతూ వచ్చాయి.