దేశంలో మళ్లి కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతూ ఉంది. శనివారం ఒకే రోజు కొవిడ్- 19 కేసుల సంఖ్య 800 మార్కును దాటింది. 126 రోజుల తర్వాత ఇంత మొత్తంలో కేసులు రావడం ఆందోళనరమైన విషయమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 5,389కి పెరిగింది. తాజా నమోదైన కేసులు 843 కాగా, దేశం వ్యాప్తంగా మొత్తం కేసులు 4,46,94,349కు చేరుకున్నాయి.
నాలుగురు మరణించడంతో మరణాల సంఖ్య 5,30,799 పెరిగింది. జార్ఘండ్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు మరణించగా, కేరళలో ఇద్దరు మరణించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, జాతీయ కొవిడ్- 19 రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైంది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,58,161కి పెరిగింది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 220.64 డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించారు.