Tuesday, November 26, 2024

జులైలో పెరిగిన వాహన వి క్రయాలు.. తగ్గిన టూ వీలర్స్‌ సేల్స్‌

దేశంలో జులైలో కార్లు, త్రీ వీలర్స్‌ అమ్మకాలు పెరిగాయి. టూ వీలర్స్‌ అమ్మకాలు మాత్రం తగ్గాయి. కార్లు, త్రీ వీలర్స్‌ హోల్‌సేల్‌ అమ్మకాలు 2.6 శాతం పెరగితే, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 7.2 శాతం తగ్గాయని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్స్‌ మాన్యూఫాక్చరర్స్‌ (ఎస్‌ఐఏఎం-సైమా) తెలిపింది. గత సంవత్సరం జులైతో పోల్చితే ఈ జులైలో వీటి అమ్మకాలు పెరిగాయి.
జులై నెలలో దేశీయంగా ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 3,50,149 యూనిట్లుగా ఉన్నాయి.

గత సంవత్సరం జులైలో ఇవి 3,41,370గా ఉన్నాయని సైమా తెలిపింది. దేశీయంగా త్రీ వీలర్స్‌ అమ్మకాలు జులైలో 56,034 యూనిట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇవి 31,324 యూనిట్లుగా ఉన్నాయి. ప్యాసింజర్‌ త్రీవీలర్స్‌ అమ్మకాలు 44,311 యూనిట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 22,427 యూనిట్లుగా ఉన్నాయి. గూడ్స్‌ క్యారియర్స్‌ అమ్మకాలు 2,745 యూనిట్లుగా నమోదయ్యాయి. జులైలో ఈ విభాగంలో విద్యుత్‌ వాహనాల అమ్మకాలు తగ్గాయి. ఇవి కేవలం 142 యూనిట్లు మాత్రమే నమోదయ్యాయి.

- Advertisement -

తగ్గిన టూ వీలర్స్‌…

జులైలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు మాత్రం గణనీయంగా తగ్గాయి. గత సంవత్సరం జులైలోజరిగిన అమ్మకాలతో పోల్చితే ఈ సారి 7.2 శాతం తగ్గాయి. ఈ సంవత్సరం జులైలో మొత్తం టూ వీలర్స్‌ అమ్మకాలు 12,82,054 యూనిట్లుగా ఉన్నాయి. ఇందులో స్కూటర్ల అమ్మకాలు 4,28,640 యూనిట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం జులైలో స్కూటర్ల అమ్మకాలు 4,79,159గా ఉన్నాయి. మోపెడ్స్‌ అమ్మకాలు 36,208 యూనిట్లుగా ఉన్నాయి. మోటార్‌ సైకిళ్ల అమ్మకాలు
8,17,206 యూనిట్లుగా నమోదయ్యాయి. క్వాడ్రిసైకిల్స్‌ అమ్మకాలు 118 యూనిట్లుగా ఉన్నాయి.

దేశంలో మంచి వర్షాలు కురుస్తున్నందున ఆర్ధిక పరిస్థితులు మార్కెట్‌కు అనుకూలంగా ఉంటాయని అంచనా వేస్తున్నామని సైమా ప్రెసిడెంట్‌ వినోద్‌ అగర్వాల్‌ చెప్పారు. రానున్న పండుగల సీజన్‌లో అన్ని రకాల వాహనాల అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నామని చెప్పారు. జులై నెలలో గతంలో ఎన్నడూ లేనంతగా ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు ఈ సారి జులైలో జరిగాయని సైమా డైరెక్టర్‌ జనరల్‌ రాజేష్‌ మీనన్‌ తెలిపారు. త్రీ వీలర్స్‌ గత సంవత్సరం ఇదే నెలతో పోల్చితే 78.9 శాతం అమ్మకాలు ఎక్కువగా జరిగాయని చెప్పారు. క్రితం మూడు నెలలతో పోల్చుకుంటే టూ వీలర్స్‌ అమ్మకాలు తగ్గాయని ఆయన చెప్పారు. రానున్న నెలల్లో వీటి అమ్మకాలు కూడా పెరుగుతాయని విశ్వాసం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement