Wednesday, November 20, 2024

పండగ సీజన్‌లో పెరిగిన వాహన అమ్మకాలు

పండగల సీజన్‌ అక్టోబర్‌లో వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే నెలతో పోల్చితే రిటైల్‌ అమ్మకాల్లో 48 శాతం వృద్ధి నమోదైనట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. 2021 అక్టబర్‌లో 14,18,726 వాహనాల రిజిస్ట్రేషన్‌ జరగ్గా, గత నెలలో అవి 20,94,378 యూనిట్లకు చేరాయి. కొవిడ్‌ మునుపటి విక్రయాలతో పోల్చినా అమ్మకాలు 8 శాతం పెరిగాయి. ప్యాసింజర్‌, వాణిజ్య, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, త్రిచక్ర వాహనాలు ఇలా అన్ని విభాగాల్లో వృద్ధి నమోదైంది.
ప్యాసింజర్‌ వాహనాల రిటైల్‌ అమ్మకాలు 41 శతం పెరిగి, 3,25,545 యూనిట్లుకు చేరాయి.

ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 51 శాతం వృద్ధి నమోదైంది. ఇవి 15,71,165 యూనిట్ల విక్రయించారు. వాణిజ్య వాహనాల విక్రయాలు 25 శాతం పెరిగి 74,443 యూనిట్లుగా నమోదయ్యాయి. త్రిచక్ర వాహన విక్రయాల్లో 66 శాతతం, ట్రాక్టర్‌ అమ్మకాలు 17 శాతం పెరిగాయి. పండగ సీజన్‌ నేపథ్యంలో విక్రయాలు భారీగా పెరగడంతో పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయని ఫాడా పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement