గడిచిన నాలుగైదు రోజులుగా హైదరాబాద్ మహా నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు అవస్థ లు పడుతున్నారు. వర్షాలతో ప్రజా రవాణా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గంగాహైదరాబాద్ మెట్రో రెలుకు రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. మూడు కారిడార్ల పరిధిలో ప్రయాణికుల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగినట్లు మెట్రో రైలు వర్గాలు పేర్కొంటున్నాయి. రోజుకు మూడున్నర లక్షల మంది ప్రయాణికులు మూడు కారిడార్ల పరిధిలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.మొదటి పేజీ తారువాయి : ట్రాఫిక్ అవస్థలు పడలేకే.. వర్షాలతో హైదరాబాద్ మహానగర రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి.
రోడ్లపై వరద ఉప్పొంగి పారుతుంటుంది. దీంతో పాటు వాహనాలన్ని ఎక్కడికక్కడే నిలిచి పోవడంతో పాటు రోడ్లపైనే గంటల కొద్దీ వేచిచూడక తప్పని పరిస్థి తులు నెలకొంటున్నాయి. అసలు బయటకు అడుగు పెట్టినవాళ్లు, ఇంటికి చేరుతారా లేదా అన్న అనుమానం కలిగే స్థాయికి నగర ట్రాఫిక్ చేరుకుంది. దీంతో ఇన్ని ఇబ్బందులు పడుతూ సొంత వాహనాలపై ప్రయాణించడం కంటే, మెట్రోలో సౌకర్యవంతంగా, సమయానుకూలంగా ప్రయాణించడం ఉత్తమమని భావిస్తున్న నగరవాసులు, మెట్రోరైల్ ప్రయాణానికే జై కొడుతున్నారు. దీంతో మూడు కారిడార్ల పరిధిలోనూ ప్రయాణీకుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. వర్షాలతో నగర వాసులు ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా మెట్రో రైలును ఆదరిస్తుండగా, నిరంతరాయ సేవలతో మెట్రో పరుగులు పెడుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.