టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల రేట్లను పెంచనుంది. జనవరి నుంచి అన్ని మోడళ్ల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో రేట్లు పెంచాల్సి వస్తుందని పేర్కొంది. పెరిగిన ధరలను కంపెనీ భరిస్తూ వచ్చిందని, ఉత్పత్తి వ్యయం మరింత పెరగడంతో ధర పెంచకతప్పలేదని టాటా మోటార్స్ తెలిపింది. కమర్షియల్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంది. కంపెనీ ఇటీవలే ప్యాసింజర్ కార్ల ధరలను పెంచింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement