ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో 2021 డిసెంబర్లో 14.6 లక్షల మంది సబ్ స్క్రైబర్లు చేరినట్టు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంఖ్య అంతకుముందు డిసెంబర్ నెలలో చేరిన సబ్ స్క్రైబర్లు 12.54లక్షలతో పోలిస్తే.. 16.4 శాతం అధికం. కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2021 నవంబర్ నెలతో పోలిస్తే.. సబ్ స్క్రైబర్ల సంఖ్య 2021 డిసెంబర్లో 19.98 శాతం పెరిగింది. 14.60 లక్షల మంది సబ్ స్క్రైబర్లలో 9.11 లక్షల మంది ఈపీఎఫ్ఓ అండ్ ఎంపీ చట్టం, 1952 కింద మొదటిసారి నమోదు చేసుకున్నారు.
తిరిగి వచ్చిన వారు 5.41లక్షలు..
ఈపీఎఫ్ఓలోకి తిరిగి వచ్చిన సబ్ స్క్రైబర్ల సంఖ్య 5.41 లక్షలు. అంతకుముందు పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని ప్రస్తుత ఖాతాకు బదలీ చేసుకున్నారు. ఇప్పుడు కొత్త ఖాతాను కొనసాగిస్తున్నారు. గణాంకాల ప్రకారం.. 2021 డిసెంబర్లో నమోదైన సబ్ స్క్రైబర్లు 22 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు వారు అత్యధికంగా 3.87 లక్షల మంది ఉన్నారు. 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వారు 2.97 లక్షల మంది వరకు ఉన్నారు. 2021 డిసెంబర్లో 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారి వాటా 46.89 శాతంగా ఉంది. ఉద్యోగుల పదవీ విరమణపై ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ప్రయోజనాలు ఈపీఎఫ్ అందిస్తుంది. సబ్ స్క్రైబర్ అకాల మరణం చెందితే.. కుటుంబ సభ్యులకు పెన్షన్, బీమా సదుపాయం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..