Tuesday, November 26, 2024

పెరిగిన బెంజ్‌కార్ల అమ్మకాలు.. మార్చిలో 4వేలకు పైగా విక్రయాలు

విలాసవంతమైన మెర్సిడెజ్‌ బెంజ్‌కార్ల అమ్మకాలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. ఈ సంవత్సరం తొలి మూడు నెలలకాలంలో ఈ సెగ్మెంట్‌లో మరే కంపెనీ లేనివిధంగా మెర్సిడెజ్‌ బెంజ్‌ కంపెనీ తన యూనిట్లను విక్రయించింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే 26శాతం వృద్ధిని రికార్డు చేసినట్లు మెర్సిడెజ్‌ బెంజ్‌ యాజ మాన్యం తెలిపింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చికాలంలో 4,022 కార్లను విక్రయించామని కంపెనీ పేర్కొంది. సెమి కండక్టర్లు, చిప్‌ కొరత వేధించినప్పటికీ తమ ఎస్‌యూవీలు, సెడాన్లు అంచనాలకు మించి అమ్ముడుపోయినట్లు పేర్కొంది.గత సంవత్సరం ఇదే కాలానికి విక్రయించిన యూనిట్ల సంఖ్య 3,193. కాగా ఈ ఏడాది తొలి మూడు నెలలకాలంలో ఈ సంఖ్య 4,000ను దాటినట్లు స్పష్టం చేసింది.

ఎస్‌యూవీ కేటగిరీలో జీఎల్‌సీకి భారీగా ఆర్డర్లు అందాయని మెర్సిడెజ్‌ బెంజ్‌ వివరించింది.జీఎల్‌సీఏ, జీఎల్‌సీఈ రకానికి చెందిన ఎస్‌యూవీలు ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. సెమికండక్టర్ల కొరత, ముడి సరుకు, రవాణా వ్యయం పెరిగినప్పటికీ ఎస్‌యూవీలు, సెడాన్స్‌కు విపరీత డిమాండ్‌ ఏర్పడిందని దీనికి అనుగుణంగా కార్ల తయారీని పెంచేలా ప్రణాళికలను రూపొందించుకున్నట్లు చెప్పారు. అమ్మకాల్లో ఇకాస్‌ లాంగ్‌ వీల్‌బేస్‌ సెడాన్‌, జీఎల్‌సీ, జీఎల్‌ఏ, జీఎల్‌ఈ రకానికి చెందిన ఎస్‌యూవీలు టాప్‌లో ఉన్నాయి.ఇక ఏఎంజీ, సూపర్‌ లగ్జరీ కార్ల కేటగిరీలో 35 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement