Saturday, November 23, 2024

పెరిగిన అముల్‌ పాల ధర.. లీటర్‌కు రూ.2 పెంపు

ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ అముల్‌ పాల ధరలు పెంచింది. పుల్‌ క్రీమ్‌ పాలు, గేదె పాలపై లీటర్‌కు 2 రూపాయలు పెంచింది. గుజరాత్‌ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిన ధరలు అమలు అవుతాయని అముల్‌ పాలను మార్కెటింగ్‌ చేసే గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ తెలిపింది. ప్రస్తుతం పుల్‌క్రీమ్‌ పాలు లీటర్‌ ధర 61 రూపాయలు ఉంది. ఇక నుంచి ఇది 63 రూపాయలు అవుతుంది.

ఈ ఏడాదిలోనే అముల్‌ పాల ధరను పెంచడం ఇది మూడో సారి. ఆగస్టులో అన్ని రకాల పాల ధరను లీటర్‌కు 2 రూపాయలు పెంచింది. పాల ప్యాకేజీ, రవాణా, పశుగ్రాసం ధరలు పెరిగాయన్న కారణం చూపి అంతకు ముందు మార్చిలోనూ లీటర్‌కు 2 రూపాయలు పెంచింది. ధర పెంచడానికి ముందుగానే ప్రకటన విడుదల చేసే కంపెకనీ , ఈ సారి మాత్రం అముల్‌ పాల ధరను పెంచిన తరువాత ప్రకటన విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement