ఇండియాలో కరోనా కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య అమాంతం పెరిగింది. సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇటీవలే కొవిడ్ బారిన పడి కోలుకున్నారు.తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాకరే, రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిలు సైతం కరోనా బారిన పడ్డారు. దీంతో,దేశవ్యాప్తంగా కరోనా అలెర్ట్ ప్రారంభమైంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా, 13,313 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయానికి కరోనాతో 38 మంది మరణించారు. కొవిడ్-19 కేసుల సంఖ్య ఇరవై నాలుగు గంటల్లోనే 12వేలకు పైగా పెరగడంతో పాజిటివ్ రేటు కూడా పెరిగింది. ప్రస్తుతం ఇండియాలో 83,990 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. అనూహ్యంగా పెరుగుతున్న కొవిడ్ కేసులపై కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.
కొవిడ్ ఫోర్త్‌వేవ్‌ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది. కొవిడ్ ఫోర్త్ వేవ్ కట్టడిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా గురువారం న్యూఢిల్లిdలోని కార్యాలయంలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కరోనా నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. బూస్టర్ డోస్ సంఖ్య పెంచాలని సమావేశంలో మంత్రి అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో గత పదిహేను రోజుల్లో 18 నుంచి 59 వయసు లోపు వారికి ఇచ్చే బూస్టర్ డోస్ డిమాండ్ 76శాతంకు పెరిగింది. ఇంకా పలురాష్ట్రాల నుంచి బూస్టర్ డోస్ డిమాండ్ పెరుగుతున్న కారణంగా అందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆరోగ్యమంత్రి మాండవియా అధికారులను ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.