మన దేశంలో గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న ఆన్లైన్ ఆర్ధిక మోసాల్లో 39 శాతం భారతీయ కుటుంబాలే బాధితులుగా ఉన్నారని లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. ఇందులో కేవలం 24 శాతం మంది అంటే 11,305 మంది మాత్రమే తమ డబ్బులను వెనక్కి తెప్పించుకోగలిగారు. దేశంలో 331 జిల్లాల్లో నిర్వహించిన ‘సీంర్వేలో 32 వేల మంది తమ స్పందన తెలిపారని లోకల్ సర్కిల్స్ తెలిపింది. వీరిలో 66 శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు ఉన్నారు.
మోసపోయిన వారిలో 23 శాతం మంది క్రెడిట్, డెబిట్ కార్డు సంబంధిత మోసాలకు గురయ్యారు.
13 శాతం మంది ఆన్లైన్ లావాదేవీలు జరుపుతుండగా డబ్బులు పొగొట్టుకున్నారు. మరో 13 శాతం మంది ఉత్పత్తులకు ముందుగానే డబ్బులు చెల్లించి, వాటి పొందలేక మోసపోయారు. మరో 10 శాతం మంది ఏటీం కార్డు, 10 శాతం మంది ఆన్లైన్ బ్యాంక్ ఖాతా వల్ల మోసాలకు గురయ్యారు. 16 శాతం మంది ఇతర రకాల ఆన్లైన్ లావాదేవీల మోసాల భారీనపడ్డారు. సర్వేలో పాల్గొనన కుటంబాల్లో 30 శాతం వరకు ఇంట్లో ఎవరో ఒకరు ఆన్లైన్ మోసాల బాధితులు ఉన్నారు. 9 శాతం కుటుంబాల్లో మాత్రం ఒకరి కంటే ఎక్కువ మంది మోసానికి గురయ్యారు.
57 శాతం మంది తమకు ఎటు వెళ్లాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నార. 12 శాతం మంది మాత్రం అసలు ఫిర్యాదే చేయలేదు. 2022 ఆన్లైన్ ఆర్ధిక మోసాలకు గురైన వారిలో 17 శాతం మంది మాత్రమే తమ డబ్బుల్ని వెనక్కి తెచ్చుకోగా, 2023లో ఇది 24 శాతానికి పెరిగింది. ఆన్లైన్ మోసాల పట్ల ప్రభుత్వాలు, బ్యాంక్లు, వివిధ సంస్థలు చేస్తున్న ప్రచారం, అవగాహన కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయి. క్రమంగా ప్రజల్లో ఆన్లైన్ మోసాల పట్ల అవగాహన పెరుగుతోంది. ఈ కృషి మరి ంత ఎక్కువ స్థాయిలో జరగాల్సి ఉందని, అప్పుడే ఆన్లైన్ మోసాలకు గురి కాకుండా యూజర్ల తమను తాము రక్షించుకోగలరు.