Sunday, November 24, 2024

Big Story | దేశంలో పెరిగిన ఆయిల్‌పామ్‌ సాగు.. స్వీయ సమృద్ధి దిశగా అడుగులు

ప్రస్తుతం మన దేశం అత్యధికంగా వంటనూనెలను వినియోగించేదిగా ఉంది. మనది 5వ అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌. పామాయిల్‌ను ప్రస్తుతం మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నూనెను సబ్బుల తయారీ నుంచి కెచప్‌ల తయారీ వరకు అన్నింటిలోనూ ఉపయోగిస్తున్నారు. పామాయిల్‌ డిమాండ్‌లో మన దేశం 90 శాతం వరకు దిగుమతి చేసుకుంటున్నాం. దేశీయంగా జరుగుతున్న ఉత్పత్తి కేవలం 2.7 శాతం అవసరాలను మాత్రమే తీరుస్తోంది. దిగుమతును తగ్గించేందుకు దేశీయంగానే పామాయిల్‌ ఉత్పత్తిని పెంచేందుకు, స్వయం సమృద్ధిని సాధించేందుకు మన దేశం కృషి చేస్తోంది.

- Advertisement -

సాగు పెం చేందుకు ప్రయత్నం….

దేశంలో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు 2025-26 నాటికి 10 లక్షల హెక్టార్లు, 2029-30 నాటికి 16.7 లక్షల హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌- ఆయిల్‌ పామ్‌లో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్‌ నికోబార్‌ దీవులపై ప్రత్యేక దృష్టి సారించింది. వరి, ఇతర పంటలతో పోల్చితే ఆయిల్‌ పామ్‌ సాగు లాభసాటిగా ఉంటుందని, తక్కువ వనరులతో సాగు చేసుకోవచ్చని, మంచి ఆదాయం వస్తుందని ప్రచారం నిర్వహిస్తోంది.
ఆయిల్‌ పామ్‌ సాగుకు తక్కువ పురుగు మందులు, ఎరువులు అవసరం అవుతాయి. అడవులను ధ్వంసం చేయకుండా, ఖాళీగా ఉన్న భూముల్లో వీటిని సాగు చేయవచ్చు.

అధిక బయోమాస్‌ ఉత్పాదక కారణంగా ఆయిల్‌పామ్‌ సాగు ప్రపంచ వ్యాప్తంగా 7 మిలియన్‌ టన్నుల కార్బన్‌ను వేరు చేయగలవని అంచనా వేశారు. ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతులు వీటిలో అంతర్‌ పంటలను సాగు చేసుకోవచ్చని గోద్రేజ్‌ ఆగ్రోవిట్‌ సీఈఓ సౌగత నియోగి చెప్పారు. రైతులు కోకో, ఎర్ర అల్లం, బుష్‌ పెప్పర్‌, అరటి వంటి వాటిని పామ్‌ ఆయిల్‌ తోటలతో పాటు సాగు చేసుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం మన దేశంలో ప్రైవేట్‌ రంగానికి చెందిన సంస్థలు, కంపెనీలు కూడా ఆయిల్‌ పామ్‌ సాగు విషయంలో సమగ్ర ప్యాకేజీలు, సమాచారం, సాధనాలు, సేవలు అందిస్తున్నాయని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement