హోళగుంద, మే 20 (ప్రభ న్యూస్): కర్నాటక ప్రాంతం హస్పెట్ పట్టణనందు ఉన్న ఆంధ్ర, కర్నాటక, తెలంగాణ ప్రాంతాల ఉమ్మడి జలాశయం తుంగభద్ర జలాశయానికి జలాశయం పై ప్రాంతాలైన శివమొగ్గ, హరిహర, తీర్థ హాళ్లి, ఆగుంబె, శృంగేరి, తదితర ప్రాంతాలలో కురుస్తున్న తొలకరి వర్షాలకు 16వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు జలాశయానికి చేరుతోంది. వేసవికాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం సాయంకాలం నాటికి తుంగభద్రజలాశయానికి 19,472 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులకు గాను 1,595.38 అడుగులలో 100 టీఎంసిల నీటి సామర్థ్యానికి గాను 14.508 టిఎంసిల నీరు నిల్వ ఉంది. అలాగే పై ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు దాదాపు 35వేల క్యూసెక్కుల నీరు జలాశయం లోకి వచ్చి చేరే అవకాశం ఉందని బోర్డు అధికారులు తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..