Friday, November 22, 2024

పసిడి ధరలు పైపైకి..

బంగారం ధర జిగేల్ మంది. పసిడి రేటు పైపైకి కదులుతోంది. నిన్న నిలకడగా కొనసాగిన పుత్తడి రేటు ఈరోజు మత్రం పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో జూన్ 28న బంగారం ధర 10 గ్రాములకు రూ. 110 పైకి కదిలింది. రూ. 51,980కు చేరింది. 24 క్యారెట్ల బంగారానికి ఇది వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు కూడా ఇదే ట్రెండ్‌ను కొనసాగింది. ఈ పసిడి రేటు 10 గ్రాములకు రూ. 100 పైకి చేరింది. దీంతో బంగారం ధర రూ. 47,650కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. సిల్వర్ రేటు కేజీకి రూ. 300 పైకి చేరింది. దీంతో సిల్వర్ రేటు రూ. 66 వేలకు ఎగసింది. వెండి ధరలో కూడా నిన్న ఎలాంటి మార్పు లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement