బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఈ రోజు కూడా బంగారం, వెండి ధరలు కొండెక్కాయి.. పసిడి రేటు పెరగడం ఇది వరుసగా రెండో సారి. హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.. 24 క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములకు రూ. 160 మేర పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 51,980కు ఎగసింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పైపైకి చేరింది. 10 గ్రాములకు రూ. 150 పెరుగుదలతో రూ. 47,650కు చేరింది. పసిడి రేటు నిన్న కూడా పెరిగింది. అంటే కేవలం రెండు రోజుల వ్యవధిలోనే బంగారం ధరలు రూ. 500కు పైగా పెరిగిందని చెప్పుకోవచ్చు.
బంగారం ధరలు పెరుగుతూ వస్తూ ఉంటే.. వెండి కూడా ఇదే దారిలో పయనిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా పసిడి రేటు పైపైకి చేరింది. ఈరోజు వెండి రేటు రూ. 400 పైకి చేరింది. దీంతో సిల్వర్ రేటు కేజీకి రూ. 63,600కు ఎగసింది. వెండి ధర రెండు రోజుల్లో చూస్తే రూ. 600 మేర పరుగులు పెట్టింది.