అమెరికాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కొవిడ్ ఆంక్షలను సడలించారు ప్రెసిడెంట్ జో బైడెన్. దీంతో కొవిడ్ నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ వచ్చిన వారు ఇంటర్నేషనల్ టూర్‌లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్య చాలామంది అమెరికా బాటపట్టారు. కొవిడ్ రిలాక్సేషన్స్ తర్వాత భారీగా టికెట్ రేట్లను పెంచేశాయి ఎర్ లైన్ సర్వీస్సెస్. అమెరికాలో 4 లక్షలకు పైగా తెలుగు వాళ్లు ఉండగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అగ్ర దేశానికి వెళ్లే వాళ్లు వేలల్లోనే ఉంటారు. అమెరికా ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ఫారెన్ వెళ్దాం అనుకునే వారికి ఇప్పుడు విమాన చార్జీలు అడ్డంకిగా మారాయి.
గతంలో భారత్ టూ అమెరికా ప్లైట్ చార్జ్ 87 వేలు ఉండేది. కానీ, ఇప్పుడు ఎర్ లైన్స్ పెంచిన ధరల కారణంగా ఒక్క టికెట్ ధర ఏకంగా 1.5 లక్షల రూపాయలు అయ్యింది. గతంలో బిజినెస్ క్లాస్ టికెట్ ధర 3 లక్షలుంటే.. ఇప్పుడు ఎకంగా 6 లక్షలకు పెంచేశాయి ఎర్ లైన్ సర్వీసెస్. వచ్చే ఏడాది జనవరి వరకు టిక్కెట్ రేట్లు తగ్గే అవకాశం లేదంటున్నారు ఎర్ లైన్ అధికారులు. విమానంలో సీట్లు తక్కువ ఉండడం.. ట్రావెల్ డిమాండ్ పెరగడంతో ప్రయాణికులను భారీగా దోచుకుంటున్నారు ట్రావెల్ సర్వీస్ ఏజెన్సీస్.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily