కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ను చమురు సంస్థలు భారీగా పెంచాయి. 19కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.105 అదనంగా పెంచా యి. సవరిం చిన గ్యాస్‌ధరలు మంగళవారం నుంచి అమ ల్లోకి వచ్చాయి. దీంతో 19కిలోల గ్యాస్ సిలిండర్ 2012కు చేరుకుంది. 5కేజీ సిలిండర్ ధర రూ.27 అదనంగా పెంచారు.
ఢిల్లిలో 5కేజీల సిలిం డర్ రూ.569కి చేరింది. అయితే సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పులేదని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. కాగా మరోవైపు విమాన ఇంధన (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయ ల్) ఏటీఎఫ్ ధరలు కూడా 3శాతం పెరిగాయి. అంతర్జాతీ యంగా చమురు ధరల పెరగడంతో ఈ నిర్ణయంతీసుకున్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..