కొత్త సంవత్సరం తొలి రోజే ప్రభుత్వం ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరను 25 రూపాయలు పెంచింది. తాజా పెంపుతో 19 కేజీల ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధర హైదరాబాద్‌లో 1973 రూపాయలకు చేరింది. ఢిల్లిలో ఇది 1768, ముంబైలో 1721, కోల్ కతాలో 1870, చెన్నయ్‌లో 1971 రూపాయలకు చేరుకుంది. వాణిజ్య సిలిండర్ ధర పెంచడంతో హోటల్స్, ఇతర సంస్థలపై భారం పడనుంది.
గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరలో మార్పు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో గృహ వినియోగ సిలిండర్ ధర 1,105 రూపాయలుగా ఉంది. నవంబర్, డిసెంబర్‌లో దీని ధరలో మార్పులేదు. 2022 జనవరిలో గృహ వినియోగ సిలిండర్ ధర 952 రూపాయలు ఉంటే, డిసెంబర్ నాటికి ఇది 1,105 రూపాయలకు చేరింది.