ప్రభన్యూస్ : జిల్లాలో గత రెండురోజులుగా చలి వణికిస్తుంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతుండటంతో చలి తీవ్రత పెరుగుతుంది. ఈ క్రమంలో చలిపట్ల ఆప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిస్తుంది. ఉదయం 9 గంటలు దాటినా చలి త్రీవత తగ్గడం లేదు. ముఖ్యంగా జిల్లాలోని మండల, పల్లే ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో తూర్పు, ఈశన్య గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతవరణ కేంద్రం తెలిపింది. ఈనెల 18 నుంచి 20వ తేది వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలు 15 డిగ్రీలు నమోదు కావచ్చని వాతవరణ శాఖ తెలిపింది. రాత్రి నుంచి చలిగాలులు మరింత బలంగా వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ చలిగాలుల ప్రభావం ఫిబ్రవరి మొదటి వారం వరకు ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
మొత్తంగా గత రెండురోజులుగా జిల్లాలో చలి తీవ్రత అధికం కావడంతో సాయంత్రం కాగానే రోడ్లన్ని నిర్మానుషంగా మారుతున్నాయి. చలి అధికంగా కావడంతో వాటిని తట్టుకునేందుకు స్వెటర్లు, మప్లర్లు, బట్టల దుఖాణాలను ప్రత్యేకంగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. చలి నివారణ దుస్తులు రూ.300 నుంచి రూ.900 వరకు ధర నాణ్యతను బట్టి అమ్మకాలు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేక దుస్తులు విక్రయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో అధికంగా మంచుపోగ కమ్ముకుంటుండటంతో మబ్బులు ఏర్పడుతున్నాయి. చలి తీవ్రతతో సాయంత్రం 7 గంటలు కాగానే ఇళ్లకు చేరిపోతున్నారు.
ఒమ్రికాన్ బుగులు
చలి తీవ్రత కారణంగా కరోనా వైరస్ బుగులు ప్రజల్లో మరింత రెట్టింపయింది. వైరస్ తగ్గినట్టే అనిపిస్తున్న తగు జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు సోకిన వారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సామాజిక దూరం పాటించాలని, ఇలాంటి వాతవరణంలో సీజనల్ వ్యాధులు అధికంగా సోకే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ పరిస్ధితిల్లోనే ఏది కరోనా, సాధారణ జ్వరం, జలుబు దగ్గు తెలియని పరిస్ధితులు నెలకొంటున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital