Friday, November 22, 2024

పెరిగిన‌ ఎయిర్ ట్రాఫిక్.. కలిసొచ్చిన పండగ సీజన్‌..

న్యూఢిల్లి, (ప్ర‌భ‌న్యూస్): దేశీయ ఎయిర్‌ట్రాఫిక్‌ అక్టోబర్‌ నెలలో గణనీయంగా వృద్ధి చెందింది. ఏడాది ప్రాతిపదికన 67 శాతం పెరిగి దాదాపు 87-88 లక్షలుగా నమోదయింది. పండగ సీజన్‌ విమాన యాన రంగానికి కలిసొచ్చిందని, కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుదల కూడా దన్నుగా నిలిచిందని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా రిపోర్ట్‌ పేర్కొంది. కాగా అక్టోబర్‌ 2020లో ఎయిర్‌ ప్యాసింజర్ల సంఖ్య 52.71 లక్షలుగా ఉందని ప్రస్తావించింది.

త్రైమాసికంపరంగా దేశీయ ప్యాసింజర్‌ ట్రాఫిక్‌లో దాదాపు 24-25 శాతం వృద్ధి నమోదయిందని పేర్కొంది. కాగా దేశీయ విమానయాన సంస్థలు 46 శాతం విమానాలను ఎక్కువగా నిర్వహించి 72 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. అయితే అధిక ఏటీఎఫ్‌(ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయెల్‌) ధరల రూపంలో సమీప భవిష్యత్‌లో విమానయాన రంగానికి ప్రమాదం పొంచివుందని, సవాళ్లు ఎదురవ్వొచ్చని నవంబర్‌ 2021 పేరిట ఇక్రా రిపోర్ట్‌ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement