రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుపై పోలీసు శాఖ, ఇతర శాఖల అధికారులతో తెలంగాణ సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. స్మగ్లర్లు వెళ్లే రహస్య మార్గాలపై నిఘా పెంచాలన్నారు.
మనీ స్మగ్లింగ్ తదితర అంశాలపై ఇతర రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించినట్లు డీజీపీ రవిగుప్తా సీఎస్ కు వివరించారు. 85 సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గత 15 రోజుల్లో సుమారు రూ.35 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వాణిజ్య పన్నుల కమిషనర్ మాట్లాడుతూ.. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద రూ.519 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరిశ్రమలు, గోదాములపై కూడా నిఘా పెంచామన్నారు.