Wednesday, November 20, 2024

విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ పెంపు.. 1900 నుంచి 5050కి పెరుగుదల

దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై విధించే విండ్‌ ఫాల్‌ ట్యాక్స్‌ను ప్రభుత్వం పెంచింది. డీజిల్‌, విమాన ఇంధనం ఎగుమతిపై విధించే సుంకాన్న కూడా పెంచుతున్నట్లు తెలిపింది. టన్ను చమురుపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ 1900 నుంచి 5,050 రూపాయలకు పెంచింది. ఎగుమతి చేసే లీటర్‌ డీజిల్‌పై పన్నును 5 నుంచి 7.5 రూపాయలకు పెంచింది. లీటర్‌ విమాన ఇంధనంపై 3.5 నుంచి 6 రూపాయలకు పెంచింది. ఫిబ్రవరి 4 నుంచే పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
గత నెల డీజిల్‌, ఏటీఎఫ్‌పై విధించే విండ్‌ఫాల్‌ పన్ను, ఎగుమతి సుంకం కనిష్ట స్థాయికి చేరాయి. తాజా పెంపుదలతో అఇ మళ్లి పెరిగాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడంతో జనవరి 17న ప్రభుత్వం ఈ పన్నులను తగ్గించింది. ఈ తరువాత అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మళ్లి పెరిగాయి. దీంతో పన్నులు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి 31తో ముగియనున్న ఆ ఆర్ధిక సంవత్సరంలో విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ ద్వారా 25వేల కోట్లు వసూలు కానున్నట్లు ఇటీవలే సీఈఐసీ ఛైర్మన్‌ వివేక్‌ జోహ్రి తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురు డీజిల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతులపై గత సంవత్సరం జులై 1 నుంచి పన్ను విధిస్తున్న విషయం తెలిసిందే.

అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా 15 రోజులకోసారి వీటిని సవరిస్తున్నారు. ఎగుమతుల వల్ల కంపెనీలు అదనపు లాఆలు పొందుతున్న నేపథ్యంలో ఈ పన్నులను తీసుకొచ్చారు. గత సంవత్సరం ఎక్సైజ్‌ సుంకంలో కోత విధించడం ద్వారా ఏర్పడిన లోటును కూడా ఈ ఆదాయం ద్వారా భర్తీ చేసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement