Friday, November 22, 2024

తెలంగాణ వైద్య విద్యార్థుల స్టయిఫండ్‌ పెంపు

హౌస్‌ సర్జన్లు, పీజీ వైద్యులు, సూపర్‌ స్పెషాలిటీ విద్యార్థుల స్లయిఫండ్‌ను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు స్టయిఫండ్ పెంచుతూ వైద్యఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ హౌస్ సర్జన్లు, పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్‌, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదువుతున్న విద్యార్థి వైద్యులకు 2021 జనవరి 1 నుంచి స్టయిఫండ్‌పై 15శాతం పెంచుతున్నట్లు తెలిపింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం మెడికల్‌, డెంటల్‌ హౌస్‌ సర్జన్‌లకు ఇకపై నెలకు రూ.22,527 అందనుంది.

పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు నెలకు రూ.50,686, రెండో ఏడాదికి రూ.53,503, మూడో ఏడాది వారికి రూ.56,319 అందనుంది. సూపర్‌ స్పెషాలిటీ మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ. 56,319, రెండో ఏడాది వారికి 59,135, మూడో ఏడాది వాళ్లకు రూ.61,949 చొప్పున స్టయిఫండ్‌ చెల్లించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement