అమెరికాలో శాశ్వత నివాసం పొందుతున్న గ్రీన్‌కార్డు దారులకు అక్కడి ప్రభుత్వం తీపికబురు అందించింది. శాశ్వత నివాస గుర్తింపు కార్డుల గడువును మరింత పొడిగించింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం, గ్రీన్‌కార్డు గడువు తీరినప్పటికీ 24 నెలలపాటు అమెరికాలోనే ఉండొచ్చు.
ఇందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఈ గడువును ఇప్పుడు మరో 12 నెలలు పొడిగించారు. దీంతో గ్రీన్‌కార్డు గడువు ముగిసిన వ్యక్తులు 36 నెలలపాటు అగ్రరాజ్యంలో ఉండేందుకు వీలుకలుగుతుంది. ఈ మేరకు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) వెల్లడించింది.