అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం, గత కొన్ని నెలలుగా 110 డాలర్లకు పైనే ఉండడం విమానయాన సంస్థలను (ఎయిర్ లైన్స్) తీవ్ర నష్టాల పాలు చేస్తోంది. దీంతో రేట్ల పెంపు పెంచినట్లు చౌక విమానయాన సేవల సంస్థ స్పైస్ జెట్ పేర్కొంది. నిర్వహణ వ్యయం అధికమవడంతో టికెట్ ధరలను 10 నుంచి 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒకవైపు చమురు ధరలు పెరగడం, మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ క్షీణించడాన్ని ఈ సంస్థ ప్రస్తావించింది. డాలర్ తో రూపాయి విలువ క్షీణించడం వల్ల దిగుమతుల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే టికెట్ ధరలు పెంచామని అని జెట్ ఎయిర్‌వేస్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. దీనివల్ల తమకు కొంతవరకు భారం తగ్గుతుందని చెప్పారు. 2021 జూన్ 21 తర్వాత ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రెట్లు 120 శాతం అధికమయ్యాయని, ఇది మోయలేని భారంగా మారిందన్నారు. నిర్వహణ వ్యయంలో ఇదే 50 శాతం ఉంటుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement