ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 53.50 శాతం పెరుగుదలతో రూ.4.60 లక్షల కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ వసూలైంది. డిసెంబర్ 16 నాటికి 2021-22 ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకముందు ఏడాది ఇదే సమయానికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.88 లక్షల కోట్లుగా మాత్రమే ఉన్నాయని ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేశాయి.
మొత్తంగా ఆర్థిక సంవత్సరం 2022లో స్థూల వసూళ్లు 40 శాతం మేర పెరిగాయి. అంతక్రితం ఏడాది ఈ సంఖ్య రూ.6,75,409.5 కోట్లుగా ఉందని ఆర్థిక శాఖ ప్రస్తావించింది. స్థూల అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు 2021-22 తొలి, రెండు, మూడు త్రైమాసికాల్లో రూ.4,59,917.1 కోట్లుగా ఉన్నాయి. 2020-21తో పోల్చితే 53.5 శాతం మేర పెరిగాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital