తమిళనాడులో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల వర్షాలు పడడంతో పలు ప్రాంతాల్లో రోడ్లన్ని జలయమం అవుతున్నాయి. గత రాత్రి నుంచి చెన్నై తో పాటు 15 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలో ఈ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే కారైక్కాల్, కడలూరు, విల్లుపురం, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. పుదుచ్చేరిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు కోస్తా ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.