న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఫేమ్ ఇండియా పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని, కొనుగోలు ధరలో ముందస్తు తగ్గింపు రూపంలో ప్రోత్సాహం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రశ్నలు అడిగారు.
ఇందుకు కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి కృష్ణ పాల్ గుర్జార్ ఫేమ్ పథకం రెండో దశ అమలుకు కేటాయించిన బడ్జెట్ వివరాలు వెల్లడించారు. 2019-2020కి రూ. 500 కోట్లు, 2020-2021కి రూ.318.36 కోట్లు, 2021-2022 ఆర్థిక సంవత్సారానికి రూ. 800 కోట్లు కేటాయించామన్నారు
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..