- కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
- ఒంటిగంటకు నాలుగు పథకాలు ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాల ప్రారంభోత్సవానికి పండుగ వాతావరణంలో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ప్రారంభించనున్న కొత్త పథకాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రేపు మధ్యాహ్నం ఎంపిక చేసిన గ్రామాల్లో ఒంటిగంటకు నాలుగు పథకాలు ప్రారంభిస్తామని చెప్పారు. ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధదారులకు నాలుగు పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారిని గ్రామానికి ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని, ఒక్కో పథకానికి ఒక అధికారికి బాధ్యతలు అప్పగించాలని సీఎస్ తెలిపారు.
లబ్ధిదారుల జాబితాను కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రారంభ సమావేశాలకు అర్హులైన లబ్ధిదారులందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.