భూపాలపల్లి( ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనదారులతో సివిల్ డ్రెస్ లో ఉన్న భూపాలపల్లి ఎస్ఐ రామకృష్ణ శుక్రవారం తనిఖీల పేరుతో దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడు. అటుగా వెళుతున్న భూపాలపల్లి మాజీ కలెక్టర్ ఆకునూరు మురళి గమనించారు.
- Advertisement -
వెంటనే అక్కడికి చేరుకుని సదరు ఎస్సైతో వాగ్వాదం కి దిగాడు. వాహనదారులని కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు అని నిలదీశారు. వెంటనే స్వారీ చెప్పాలని డిమాండ్ చేయడం తో ఎస్సై సదరు వాహనదారునికి సారి చెప్పి అక్కడినుండి అటకాయించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ వైరల్గా మారింది.