Thursday, November 21, 2024

లండన్‌-ముంబై ఎయిరిండియా ఫ్లైట్‌లో భారత సంతతి వ్యక్తి అనుచిత ప్రవర్తన.. అరెస్టు చేసిన ముంబై పోలీసులు

లండన్‌ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిరిండియా విమానంలోని వాష్‌ రూంలో ధుమపానం చేసి, తోటి ప్రయాణికులు, విమాన సిబ్బందిలో అనుచితంగా ప్రవర్తించిన భారత సంతతికి చెందిన అమెరికన్‌పై కేసు నమోదు చేశారు. 37 ఏళ్ల రమాకాంత్‌పై ముంబైలోని సహర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముంబై పోలీసుల ప్రకారం, భారత శిక్షాస్మృతి(ఐపీసీ) సెక్షన్‌ 336 (మానవ ప్రాణాలకు లేదా ఇతరుల వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే విధంగా ఎవరైనా ఏదైనా పనిని చేయడం), ఎయిర్‌ క్రాఫ్ట్‌ చట్టం 1937, 22 ( పైలెట్‌ ఇన్‌చార్జ్‌ కామాండ్‌ ఇచ్చే చట్టబద్ధమైన సూచనలను నిరాకరించడం), 23 (దాడి, ఇతర చర్యలు భద్రతకు హాని కలిగించేవి), 25 (ధుమపానం) కింద కేసు నమోదు అయింది.

విమానాలలో ధుమపానానికి అనుమతి ఉండదు. కానీ, నిందితుడు వాష్‌ రూమ్‌కి వెళ్లగానే అలారం మోగింది. సిబ్బంది వెళ్లి చూడగా, ఆ వ్యక్తి చేతిలో సిగరేట్‌ ఉందని ఎయిర్‌ సిబ్బంది భారత్‌ సహార్‌ పోలీసులకు తెలిపింది. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తి విమానం తలుపులను తెరిచేందుకు ప్రయత్నించాడు. అతడి ప్రవర్తనకు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని సిబ్బంది తెలిపారు. నిందితుడు అరుస్తూ, అనుచితంగా ప్రవర్తించాడు.

- Advertisement -

ముంబైలో విమానం దిగగానే సదరు వ్యక్తిని సహార్‌ పోలీసులకు అప్పగించామని అన్నారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడా లేక మానసిక సమతుల్యత కోల్పోయిన ఉన్నాడా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వైద్య పరీక్షల కోసం అతని నుంచి సేకరించిన నమూనాలను పంపామని పోలీసులు తెలిపారు. మార్చి 10న లండన్‌ నుంచి ముంబైకి వెళ్తున్న ఏఐ130 ఫ్లైట్‌లో జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement