రెండు నెలల్లో తెలుగు సినిమా ప్రేక్షకులు ఎన్నో సినిమాలను చూడబోతున్నారు. అన్ని సినిమాలకు కలిపి ఏకంగా 500 కోట్లకు పైగా బిజినెస్ జరిగే అవకాశం ఉంది. దీంతో రానున్న ఈ రెండు నెలలు తెలుగు సినీ ఇండస్ట్రీకి చాలా కీలకంగా మారనుంది. స్ట్రెయిట్, డబ్బింగ్, పెద్ద, చిన్న సినిమాల కేటగిరీలో ఎన్నో మూవీస్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. సెప్టెంబర్-అక్టోబర్ నెలలు సినీ డిస్టూబ్యూటర్లకు చాలా కీలకం, ఎందుకంటే రాబోయే సినిమాలను బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలనున్నాయి.
ఈ జాబితాలో మొదటి మూవీ విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ఖుషీ ఉంది. సెప్టెంబర్ 1న విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 కోట్ల ప్రీ బిజినెస్ చేసింది. ఇక, సెప్టెంబరు 7న షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ విడుదలవుతుండగా, ఆ సినిమా తెలుగు వెర్షన్ హక్కులు 15 కోట్లకు కోట్ అవుతున్నట్లు సమాచారం. అలాగే.. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను స్కంద సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుండగా, ఈ సినిమా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50 కోట్ల బిజినెస్ చేసింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బాగా ప్రచారంలో ఉన్న సీక్వెల్ టిల్లు స్క్వేర్ వ్యాపారం దాదాపు 20 కోట్లకు పైగానే ఉంటుంది. అదే విధంగా రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 కూడా 13 కోట్లకు ప్రీ బిజినెస్ చేసింది. ది మోస్ట్ ఎవైటెడ్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ ల సాలార్ మూవీ మేకర్స్ 200 కోట్ల రేంజ్ లో కోట్ చేశారట.
బాలకృష్ణ భగవంత్ కేసరి 65 కోట్లు, దళపతి విజయ్ లియో 23 కోట్లు. దాదాపు 30 కోట్లతో రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు.. కొన్ని చిన్న సినిమాలు కూడా ఈ పెద్ద సినిమాల మధ్య విడుదలవుతున్నాయి. ఓవరాల్‌గా, వచ్చే 2 నెలల్లో విడుదలవుతున్న అన్ని సినిమాల బిజినెస్ మొత్తం కలిపితే, అది కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే దాదాపు 500 కోట్లు దాటుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.