Tuesday, November 26, 2024

రాగల 48 గంటల్లో.. రాష్ట్రాన్ని తాకనున్న రుతుపవనాలు

అమరావతి, ఆంధ్రప్రభ: దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో రాష్ట్రాన్ని తాకనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రతికూల వాతావరణం కారణంగా నైరుతు రుతు పవనాలు మెల్లగా కదులుతున్నాయి. రానున్న 48 గంటల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, కొంకణ్‌ లోని మిగిలిన ప్రాంతాల్లోకి, గుజరాత్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు, మొత్తం కర్ణాటక మరియు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలోని మరికొన్ని ప్రాంతా లలోకి రెండు నుండి మూడు రోజులలో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతూ ఉంటాయని తెలిపింది. మొదట ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ ప్రాంతాన్ని రుతుపవనాలు తాకుతాయని ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈశాన్య మధ్యప్రదేశ్‌ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరం వద్ద సగటు సముద్ర మట్టం నకు 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీన పడింది. సోమ, మంగళవారాల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్‌ మరియు యానాంలో గరిష్ట ఉష్ణో గ్రతలు , సగటు ఉష్ణో గ్రతల కంటే 2 – 4 డిగ్రీ ల సెంటీగ్రేడ్‌ అధికంగా ఉండే అవకాశం ఉంది మరియు రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు, సగటు ఉష్ణోగ్రతల కంటే 2 – 3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ, వేగం తో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement