Friday, November 22, 2024

HYD: సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ.6కోట్ల మోసం..

సినిమాల్లో పెట్టుబడుల పేరుతో నగరంలో రూ.6కోట్ల మోసం జరిగింది. కూకట్ పల్లికి చెందిన అంజమ్మ, నాగం ఉమా శంకర్ లు మోసాలకు పాల్పడ్డారు. RRR, అలవైకుంఠపురం, లవ్ స్టోరీ లాంటి సినిమాల్లో పెట్టుబడులు అని చెప్పి వసూళ్లకు పాల్పడ్డారు. పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తామని అంజమ్మ, ఉమా శంకర్ లు నమ్మించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను టార్గెట్ చేసి మోసగాళ్లు డబ్బులు వసూలు చేశారు. బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement