పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సంబంధిత కార్యక్రమానికి హాజరై తిరిగి ఢిల్లీకి వస్తున్న సమయంలో ఫిబ్రవరి 3న ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ఈ కేసులో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో నిందితుల బెయిల్ పై అలహాబాద్ కోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. నిందితుల రిమాండ్ పై తిరిగి విచారణ జరిపి నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా నిందితుల బెయిల్ మంజూరుకు హైకోర్టు కారణం చెప్పలేదని సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు నిందితులు వారం రోజుల్లో లొంగిపోవాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది.
అసదుద్దీన్ కారుపై కాల్పుల కేసులో.. అలహాబాద్ కోర్టు తీర్పు కొట్టివేత..
Advertisement
తాజా వార్తలు
Advertisement