రెండు రోజులపాటు జరిగే అటవీశాఖ ప్రాంతీయస్థాయి క్రీడలు తెలంగాణ రాష్ట్ర అటవీఅకాడమీ, దూలపల్లి, హైదరాబాదులో ఆదివారం ప్రారంభమయ్యాయి. క్రీడలను చార్మినార్ అటవీ సర్కిల్ సంరక్షణాధికారి బి.సైదులు ప్రారంభించారు. చార్మినార్ అటవీ సర్కిల్ కు చెందిన మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అటవీ అధికారులు, ఉద్యోగులు, అటవీ అభివృద్ది సంస్థ, అటవీ కళాశాల.. పరిశోధక సంస్థల అధికారులు, ఉద్యోగులు ఈ క్రీడలలో పాల్గొంటున్నారు..
పరుగు పందాలు, లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్, జావెలిన్ త్రో, క్రికెట్, ఫుట్ బాల్, వాలీబాల్, బాడ్మింటన్, టెన్నిస్, రైఫిల్ షూటింగ్ మొదలగు అంశాలలో స్త్రీ, పురుషుల మరియు ఓపెన్, వెటరన్, సీనియర్ వెటరన్ విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడా పోటీలను రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి(విజిలెన్స్), అటవీ అకాడమీ సంచాలకులు, ఎల్యుసింగ్ మేరు సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.