Friday, November 22, 2024

అగ్రిగోల్డ్ కేసులో – సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సుప్రీంకోర్టు అగ్రిగోల్డ్ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో తెలంగాణకు చెందిన డిపాజిటర్లు కూడా ఏపీలోని ఏలూరులో ఏర్పాటు చేసిన కోర్టుకే వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఏలూరు కోర్టులో ఈ కేసు పరిష్కారం కాని పక్షంలోనే హైకోర్టుకు గానీ, సుప్రీంకోర్టుకు గానీ వెళ్లేందుకు అవకాశం ఉంటుందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అగ్రిగోల్డ్ సంస్థ ఏకంగా 32 లక్షల మంది డిపాజిట్లను నట్టేట ముంచిందని, ఈ వ్యవహారంలో ఆ సంస్థ రూ.6 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని సేకరించిందని.. తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ముందుగా ఏలూరు కోర్టుకే వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన కొన్ని ఆస్తులను వేలం వేయడం ద్వారా తెలంగాణ హైకోర్టు కేవలం రూ.50 కోట్లే రాబట్టిందన్న డిపాజిటర్లు… ఆ తర్వాత కేసును ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు చెప్పిందని సుప్రీంకోర్టుకు తెలిపారు. తెలంగాణ హైకోర్టు తీర్పును వారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే హైకోర్టు తీర్పును రద్దు చేయడం గానీ, మార్చడం గానీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement