Wednesday, December 4, 2024

Syed Modi Tourney | భార‌త్ సంచ‌ల‌నం… బ్యాడ్మింటన్‌లో మూడు టైటిళ్లు కైవసం !

సయ్యద్‌ మోడీ అంతర్జాతీయ సూపర్‌ 300 టోర్నీలో భారత దిగ్గజ షట్లర్‌ పీవీ సింధు అదరగొట్టింది. ఆదివారం లక్నోలోని బాబు బనారసి దాస్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన ఫైన‌ల్స్ లో సింధు విజ‌యం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు వరుస వరుస సెట్లలో విజయం విజ‌యం సాధించి.. చైనాకు చెందిన లుయో యు వును 21-14, 21-16 పాయింట్ల తేడాతో చిత్తు చేసింది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, సంధు చివరిసారిగా 2022లో సింగపూర్ ఓపెన్‌లో బీడ‌బ్ల్యూఎఫ్‌ వరల్డ్ టూర్‌లో టైటిల్‌ను గెలుచుకుంది. అయితే, దాదాపు రెండేళ్ల తర్వాత సింధుకి ఇదే తొలి టైటిల్ కావడం విశేషం.

సేన్ విజృంభణ

మ‌రోవైపు, పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కూడా భారత్ గెలుచుకుంది. సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ జాసన్ తేహ్‌తో త‌ల‌ప‌డిన లక్ష్య సేన్… వరుస గేమ్‌లలో విజృంభించాడు. 21-6, 21-7 పాయింట్ల తేడాతో జియా హెంగ్‌ను చిత్తు చేసిన సేన్.. 28 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

- Advertisement -

తనీషా క్రాస్టో, ధ్రువ్‌ కపిల జోడీ దూకుడు..

మహిళల డబుల్స్‌లో గాయత్రీ గోపీచంద్-తెరెసా జాలీ జోడీ విజేతగా నిలిచింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన ఈ రెండో సీడ్ భారత జోడీ… 41 నిమిషాల్లో చైనాకు చెందిన లీ జింగ్ బావో – లీ కియాన్‌లను 21-18, 21-11తో ఓడించి టైటిల్ చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో టైటిల్ గెలిచిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా రికార్డు సృష్టించింది.

అయితే మిక్స్‌డ్ డబుల్స్ లో మాత్రం భార‌త్ కు నిరాశే మిగిలింది. ఫైనల్లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ ఓట‌మిపాలైంది. ఐదో సీడ్‌ ధృవ్‌-తనీషా జోడీ 21-18, 14-21, 8-21తో ఆరో సీడ్‌ థాయ్‌ జంట డెచాపోల్‌ పువారానుక్రోహ్‌- సుపిస్సారా పావ్‌సంప్రాన్‌ చేతిలో ఓడిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement