దేశంలో ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం రేపుతున్నాయి. మరోవైపు కొందరిలో వైట్ ఫంగస్ కూడా నిర్ధారణ అవుతోంది. అయితే, మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్‌తో పాటు వైట్ ఫంగస్ కూడా ఒకేసారి సోకింది. గ్వాలియర్‌లోని ఓ రోగిలో ఈ ఫంగస్‌లను గుర్తించి దేశంలో ఈ తరహా కేసు నమోదు కావడం ఇదే మొట్టమొదటి సారి ఇప్పటికే పలు రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధుల నిరోధక చట్టం కింద మహమ్మారిగా గుర్తించాయి. కరోనా సోకి స్టెరాయిడ్ థెరపీ తీసుకున్న వారిలో, మధుమేహం అదుపులోని లేని వారిలో బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement