Tuesday, November 26, 2024

14న భారత్‌లో.. 5జీ ఫోన్‌ లాంచ్ : ఇన్ఫినిక్స్‌ సీఈఓ అనీష్‌

ఇన్ఫినిక్స్‌ జీరో 5జీ ఫోన్‌, భారత్‌లో 14వ తేదీన విడుదల కాబోతున్నది. హాంకాంగ్‌కు చెందిన ఈ ఇన్ఫినిక్స్‌ ఫోన్‌కు సంబంధించిన కీలక విషయాలను కంపెనీ ప్రకటించింది. మీడియా టెక్‌ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌, 13 బ్యాండ్‌ 5జీ సపోర్టుతో ఈ హ్యాండ్‌సెట్‌ భారత్‌లో గ్రాండ్‌ లాంచింగ్‌కు సిద్ధం అవుతున్నది. ఇన్ఫినిక్స్‌ సీఈఓ అనీష్‌ కపూర్‌ మాట్లాడుతూ.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర భారత్‌లో రూ.20వేల కంటే తక్కువే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్ఫినిక్స్‌ కంపెనీ నుంచి వస్తున్న తొలి 5జీ ఫోన్‌ అని వివరించారు. గ్లోబల్‌ ప్రైస్‌ 350 డాలర్లుగా ఉంటోంది.

భారత్‌ కరెన్సీతో పోల్చుకుంటే.. రూ.26వేలు. 6.7 ఇంచ్‌ అమోల్డ్‌ డిస్‌ ప్లే, 120 హెర్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌, మీడియా టెక్‌ డైమెన్సిటీ 900 చిప్‌సెట్‌, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజీ ఉంటుంది. ట్రిపుల్‌ బ్యాక్‌ కెమెరా సెటప్‌, 48 మెగా పిక్సెల్‌ ప్రైమరీ సెన్సార్‌, టెలీఫొటో సెన్సార్‌, అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ సెన్సార్‌ కలిగి ఉంది. ఫ్రంట్‌ కెమెరా 16 మెగా పిక్సెల్‌గా ఉండనుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌తో దీన్ని రూపొందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement