దేశంలో గడిచిన నాలుగు రోజులుగా మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 3,26,098 కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు మహమ్మారి కారణంగా 3890మంది మృతి చెందారు. అదే విధంగా 3,53,299 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
తాజా గణాంకాల ప్రకారం….దేశంలో మొత్తం 2,43,72,907 కేసులు నమోదు కాగా 2,66,207 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. అలాగే ఇప్పటివరకు 2,04,32,898 మంది కొలుకున్నారు. ఇంకా 36,73,802 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.