Friday, November 22, 2024

నిరుద్యోగులకు గుడ్ న్యూస్…3400 ఖాళీలు – వెంటనే అప్లై చేసుకోండి !!

దేశంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో
3400 ఉద్యోగాల భర్తీ కి కేంద్ర గిరిజన వ్యవహారాల
మంత్రిత్వ శాఖ సిద్ధం అయింది. ఈ మేర దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. తెలంగాణలో 262 పోస్టులు ఉండగా అందులో ప్రిన్సిపాల్-11, వైస్ ప్రిన్సిపాల్-6, పీజీటీ- 77, టీజీటీ- 168 ఖాళీలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో 117 పోస్టులు ఉండగా అందులో ప్రిన్సిపాల్-14, వైస్
ప్రిన్సిపాల్-6, టీజీటీ- 97 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్‌ను https://tribal.nic.in/ వెబ్ సైట్ లో చూడవచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ- NTA ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన రిక్రూట్‌మెంట్
https://recruitment.nta.nic.in/WebinfoEMRSRecruitment,వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు-3479
ప్రిన్సిపాల్- 175
వైస్ ప్రిన్సిపాల్-116
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్- 1244
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్- 1944

దరఖాస్తు ప్రారంభం 2021 ఏప్రిల్ 1. దరఖాస్తుకు చివరి తేదీ 2021 ఏప్రిల్ 30. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 2021 మే 1 రాత్రి 11.50 గంటలు దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి 2021 మే 4 నుంచి 6 అడ్మిట్ కార్డుల డౌన్లోడ్,
పరీక్ష తేదీ- మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో ఉంటుంది.

- Advertisement -

విద్యార్హతలు

ప్రిన్సిపాల్ పోస్టుకు ఏదైనా స్కూలింగ్ సబ్జెక్ట్ లో
మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. లేదా టీచింగ్ లో మాస్టర్స్ డిగ్రీ లేదా
బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. 10 ఏళ్లు ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్ గా పనిచేసిన అనుభవం ఉండాలి. టీజీటీ, పీజీటీ
పోస్టుకు మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ పాస్ కావాలి.

దరఖాస్తు ఫీజు

ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టుకు రూ.2,000. పీజీటీ, టీజీటీ పోస్టుకు రూ.1,500.

ఎంపిక విధానం
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ.

Advertisement

తాజా వార్తలు

Advertisement