టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రిలీజ్కు రెడీగా ఉన్న సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కరోనా దెబ్బకు పెద్ద సినిమాలన్నీ ఫెస్టివల్స్ హడావుడిలో చేరాయి. మళ్లీ కరోనా న్యూ వేరియంట్ అయిన ఒమిక్రాన్ కారణంగా ఎక్కడ దెబ్బ పడుతుందో అనే భయంతో ఫెస్టివల్స్ లోనే సినిమాలను వదులుతున్నారు.
ఆ సమయంలోనే జనాలు థియేటర్స్ లోకి వస్తారని దర్శక నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే మళ్లీ రెండు బడా సినిమాలు సమ్మర్ లో పోటీకి సై అంటున్నాయి. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో పాటు విజయ్ దేవరకొండ లైగర్ మూవీ కూడా ఒకే తేదీన రాబోతుండడం చర్చనీయాంశంగా మారింది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..