Monday, November 18, 2024

చెక్ బౌన్స్ కేసులో – న‌గ‌రి కోర్టుకు జీవిత‌రాజ‌శేఖ‌ర్

చెక్ బౌన్స్ కేసులో చిత్తూరు జిల్లా న‌గ‌రి కోర్టుకు హాజ‌ర‌య్యారు జీవితా రాజ‌శేఖ‌ర్. త‌మ‌కు రూ.26 కోట్ల బ‌కాయి ప‌డ్డారంటూ ఆమెపై ఇటీవ‌ల జోస్ట‌ర్ గ్రూప్ యాజ‌మాన్యం ఆరోపించింది. త‌మ వ‌ద్ద అప్పు తీసుకున్న జీవిత రుణాన్ని తిరిగి చెల్లించ‌లేద‌ని ఆరోపించింది. అంతేకాకుండా జీవిత ఇచ్చిన చెక్‌ను బ్యాంకులో డిపాజిట్ చేయ‌గా… అది బౌన్స్ అయ్యింది. ఈ వ్యవ‌హారంపై నేరుగా న‌గ‌రి కోర్టును ఆశ్ర‌యించిన గ్రూప్ యాజ‌మాన్యం త‌మ రుణాన్ని ఇప్పించాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు… జీవితా రాజ‌శేఖ‌ర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ క్ర‌మంలోనే గురువారం జ‌రిగిన కోర్టు విచార‌ణ‌కు జీవిత స్వ‌యంగా హాజ‌ర‌య్యారు. త‌న న్యాయ‌వాదుల‌ను వెంట‌బెట్టుకుని ఆమె కోర్టుకు వ‌చ్చారు.. ఈ వ్య‌వ‌హారంపై గ‌తంలోనే స్పందించిన జీవిత‌… జోస్ట‌ర్ గ్రూప్ త‌మ‌పై తప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement