బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజల నుంచి వినతుల వెల్లువ కొనసాగుతోంది. ఐదో విడత పాదయాత్రలో భాగంగా ఇప్పటికే వివిధ వర్గాల ప్రజల నుంచి 2237 వినతి పత్రాలను బండి సంజయ్ అందుకున్నారు. అత్యధికంగా నిరుద్యోగుల నుంచే వినతి పత్రాలు అందుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం నియమించిన ‘బిస్వాల్ కమిటీ’ ఇచ్చిన నివేదికలోని 1.లక్ష 91 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ… బండి సంజయ్ కి నిరుద్యోగ యువత వినతి పత్రాలు సమర్పించారు. కనీసం ‘నిరుద్యోగ భృతి’కి నోచుకోలేదని వినతి పత్రాల్లో నిరుద్యోగులు పేర్కొన్నారు. 2018 ఎన్నికలకు ముందు ‘నిరుద్యోగ భృతి’ ఇస్తానని ప్రకటించిన కేసీఆర్… నేటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడుతున్నారు. పెన్షన్స్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రావడంలేదని బండి సంజయ్ కి పలువురు గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement