ఇస్లామాబాద్:పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డట్టే ఉంది. ఆయనకు పదవీగండం ముంచుకొస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఒకవైపు విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో సొంత పార్టీలో వ్యతిరేకత ఇమ్రాన్‌కు తలనొప్పిగా మారాయి. మరోవైపు సంకీర్భ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. పాకిస్తాన్ ముస్లిమ్ లీగ్ -నవాజ్ (పీఎమ్ఎల్-ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)లకు చెందిన 100మంది చట్టసభ సభ్యులు ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ ఈనెల 8వ తేదీన జాతీయ అసెంబ్లిలో నోటీసు ఇచ్చాయి. కాగా ఇమ్రాన్ సొంత పార్టీకి చెందిన 24మంది చట్టసభ సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement