Tuesday, November 26, 2024

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ళ జైలుశిక్ష

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ళ జైలుశిక్ష విధిస్తూ పాకిస్తాన్ లోని ఓ కోర్టు శనివారం తీర్పు ఇచ్చింది. ఇమ్రాన్ పై నమోదైన తోషాఖానా కేసును విచారించిన కోర్టు ఈమేరకు తీర్పు వెలువరించింది..

ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఖరీదైన ప్రభుత్వ బహుమతులను విక్రయించి వ్యక్తిగతంగా లబ్ధి పొందారనే అభియోగాలు నమోదయ్యాయి. దీన్నే తోషాఖానా కేసు అని అంటారు. ఇందులో ఇమ్రాన్ ను దోషిగా తేల్చిన కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement