ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఊరట లభించింది. తోషాఖానా కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు నిలిపేసింది. తోషాఖానా అవినీతి కేసులో తనకు పడ్డ శిక్షను రద్దు చేయాలంటూ ఇమ్రాన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్‌లోని అటక్ జిల్లా జైలులో ఇమ్రాన్ శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కారాగారంలో వసతులపై తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయనకు తాజాగా కొన్ని అదనపు సౌకర్యాలు కల్పించారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఆయన ఈ కేసు నుంచి బయటపడనున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement