Friday, November 22, 2024

ఆక‌ట్టుకుంటున్న‌ పిజ్జా డెలివరీ కారు.. మీరూ ఓ లుక్కేయండి..!

బెర్లిన్‌: చిన్నసైజు నాజూకు కార్ల తయారీకి పేరుగాంచిన ఇటాలియన్‌ ఆటో పరిశ్రమ ఇప్పుడు ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలోకి అడుగుపెట్టింది. అదేబాటలో జర్మనీకి చెందిన ఈవీ కార్ల సంస్థ ఓ చిన్నసైజు పిజ్జా డెలివరీ కార్‌ను రూపొందించింది. ఈ చిట్టికారుకు వెనుక వైపున పిజ్జా బాక్స్ అమ‌ర్చి ఉంటుంది. మొత్తంగా పిక్సర్‌ మూవీలో కనిపించే కారు మాదిరిగా ఉంది. ఈ నూతన ఆవిష్కరణను జర్మనీలో నిర్వహించిన అంతర్జాతీయ మొబిలిటీ షోలో ప్రదర్శనకు ఉంచారు. ఇటాలియన్‌ జాతీయ జెండాను తలపించేలా దీనికి ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ముస్తాబు చేశారు. ముందు భాగంతో పాటు పైభాగం గుండ్రంగా డిజైన్‌ చేయబడింది. దీనిని ఒకసారి పూర్తిగా రీచార్జి చేస్తే ఏకంగా 234 కి.మీ. ప్రయాణించగలదని తయారీ సంస్థ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement