దేశంలో నం.1 ఆడియో బ్రాండ్ గా ఉన్న boAt కంపెనీ ఎప్పటికప్పుడు యూజర్లకు అనుగునంగా కొత్త ఫీచర్లతో ఇయర్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు & వైర్‌లెస్ స్పీకర్‌లను మార్కెట్ లో రిలీజ్ చేస్తూనే ఉంటుంది. అదే విధంగా boAt ఇటీవల తన బ్రాండ్ లిస్ట్ లో “లూనార్ కనెక్ట్ ఏస్, అల్టిమా కనెక్ట్ & Xtend Plus” స్మార్ట్‌వాచ్‌లను యాడ్ చేసుకుంది. ఇప్పుడు “బోట్ స్టోర్మ్ కాల్ 2” అనే మరో స్మార్ట్ వాచ్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది కంపెనీ. ఈ కొత్త స్మార్ట్‌వాచ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. మరి ఈ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్ లు ఎలా ఉన్నాయో చూద్దాం..
boAt Storm Call 2 స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్స్ :
boAt Storm Call 2 స్మార్ట్‌వాచ్ 240 x 284 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో ఆకట్టుకునే 1.83-అంగుళాల HD డిస్‌ప్లేను తో వస్తోంది. దీంతో యూజర్లకు స్పష్టమైన విజువల్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే ఈ వాచ్ కు ఉన్న మరో ప్రత్యేక ఫీచర్లలో వేకప్ జెస్టర్ ఫీచర్ ఒకటి. ఈ ఫీచర్ ద్వారా వాచ్ వినియోగదారుల చేతి సాధారణ కదలికతో కూడా వాచ్ డిస్ప్లే ఆన్ చేయడానికి సులువుగా ఉంటుంది. స్మార్ట్‌వాచ్‌లో సిరి లేదా గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌లను కూడా పొందుపరిచారు.
అలాగే, ఈ స్మార్ట్‌వాచ్‌లో ప్రీమియం ఇన్ బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్ ఉంది. ఈ ఫీచర్ యూజర్లకు బెస్ట్ & హై క్వాలిటీ బ్లూటూత్ కాలింగ్ చేసుకోడానికి సపోర్ట్ చేస్తోంది. స్మార్ట్‌వాచ్‌లో ఇంటరాక్టివ్ డయల్-ప్యాడ్ కూడా ఉంది, దాంతో వినియోగదారులు కేవలం కాల్‌లకు సమాధానం ఇవ్వడమే కాకుండా.. స్మార్ట్‌వాచ్ నుంచి కాల్స్ కూడా చేయవచ్చు. అంతే కాకుండా..ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడానికి ఆన్‌బోర్డ్‌లో డిజిటల్ రివార్డ్ సిస్టమ్ కూడా ఉంది. boAt స్టార్మ్ కాల్ 2 హెల్త్ మానటరింగ్ (SpO2, హార్ట్ రేట్, బ్రీతింగ్ ఎక్సైర్సైజ్, స్లీప్ మానటరింగ్) ఫీచర్ కూడా ఉంది. దీంతో వినియోగదారుల ఆరోగ్యాన్ని సమర్థవంతంగా ట్రాక్ చేయడానికి వీలుగా ఉంటుంది.
ఈ వవాచ్ లో లైవ్ స్పోర్ట్స్ స్కోర్స్ అనే ఫీచర్ కూడా ఉంది. దీంతో యూజర్స్ కు ఇష్టమైన జట్లు లేదా మ్యాచ్‌ల రియల్ టైమ్ లైవ్ అప్‌డేట్‌లను అందించడం ఈ ఫీచర్ పని. ఈ ఫీచర్ స్పోర్ట్స్ లవర్స్ ను బాగా ఆకట్టుకునే చాన్స్ ఉంది. అలాగే, 1000 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లతో వస్తోంది ఈ వాచ్ దీంతో వినియోగదారులకు నచ్చిన స్టైల్ లో స్మార్ట్‌వాచ్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.
స్మార్ట్‌వాచ్ బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ వాచ్ ఒకే ఛార్జ్‌పై 5 రోజుల వరకు పని చేస్తోంది. అదనంగా, IP67 రేటింగ్‌తో డస్ట్ & వాటర్ రిసిస్టెన్స్ తో వస్తోంది. బోట్ స్టార్మ్ కాల్ 2 ఎక్స్ ట్రా యూజబుల్ ఫీచర్లలో మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్, స్టాప్‌వాచ్, అలారం & టైమర్ ఫంక్షనాలిటీలు ఉన్నాయి.
ధర & లభ్యత :
boAt Storm Call 2 Smartwatch ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రూ.1,299కి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.